తెలుగుదేశం పార్టీ 40 వసంతాలలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో పలు వార్డులులో జండా ఆవిష్కరణల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు పట్టణ, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఇంటి వద్ద నుండి ర్యాలీగా ప్రారంభమై పట్టణంలో సుమారు 25 ప్రాంతాలలో జండా పండుగను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు , నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.