పెనగంచిప్రోలులో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కర్రసాము ఆకట్టుకుంది. కాగా విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయి ఎదగాలని ఎమ్మెల్యే తాతయ్య సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు.