ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు, జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం మిమ్మల్ని శాంతి, ప్రేమ, శ్రేయస్సుతో నింపాలని, జీవితంలో ప్రతి రోజు కొత్త ఆశ, చిరునవ్వు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉదయభాను తెలిపారు.