క్షేత్ర స్థాయిలో టీడీపీ కూటమి వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగుదామని ఎన్ టి ఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. గురువారం జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామంలో వైసిపి కార్యకర్తల సమావేశం, నూతనంగా ఎంపికైన గ్రామ పార్టీ అధ్యక్షులు బుతుకూరి కొండారెడ్డి ప్రమాణస్వీకర కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు.