గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్రిష్ణమ్మ తల్లి నిండుకుండను తలపిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణానదిపై ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుండి 10 గేట్లను ఎత్తి నీటిని కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కు నీటిని వదలడం జరిగింది. నాగార్జునసాగర్ నిండిపోవడంతో ఆ నీటిని కింద ఉన్న పులిచింతల ప్రాజెక్టు విడుదల చేయడం జరిగింది. తద్వారా పులిచింతల ప్రాజెక్టు నుండి 6 గేట్లను ఎత్తి ఆ నీటిని ప్రకాశం బ్యారేజ్ కు విడుదల చేయడం జరిగింది. తద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గం లోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ తల్లి అందాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.