పెనుగంచిప్రోలు: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం

54చూసినవారు
పెనుగంచిప్రోలు: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశారు. ఇల్లు తాళాలు ధ్వంసం చేస్తుండగా అలికిడి గమనించిన ఓ వృద్ధుడు.. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. దొంగ కోసం తీవ్రంగా గాలించారు.గ్రామ శివారు పంటపొలంలో ఉన్నట్లు గమనించిన దొంగను పట్టుకున్నారు. పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. రెండు రోజుల క్రితం గ్రామంలో రెక్కి నిర్వహించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సుమారు ఎనిమిది మంది (కుటుంబ సభ్యుల) వచ్చినట్లు దొంగ తెలిపారు.

సంబంధిత పోస్ట్