కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో మోడల్ కాలనీ వాసులు మంచినీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శనాల కమలేష్, యువ నాయకుడు మోరే వినోద్ స్థానిక నాయకులు శరణం బాలయ్య వెంటనే స్పందించి పంచాయితీ నీటి సిబ్బంది ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా పనులను ప్రారంభించారు. మరి కొద్ది రోజులలో మోడల్ కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు అందే విధంగా చూస్తామని తెలియజేశారు. వేగంగా స్పందించి కార్యచరణ ప్రారంభించిన షేర్ మహమ్మద్ పేట గ్రామపంచాయతీ వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోడల్ కాలనీ వాసులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం యువ నాయకుడు మోరే వినోద్ మాట్లాడుతూ షేర్ మహమ్మద్ పేట గ్రామానికి గ్రౌండ్ వాటర్ తగ్గకుండా ఎర్ర కాలువ ద్వారా స్థానిక చెరువుకు మరి కొద్ది రోజులలో నీటిని తీసుకువస్తున్నట్లు తెలియజేశారు.