జగ్గయ్యపేట పట్టణంలోని ఒకటవ వార్డు మెయిన్ రోడ్ లో గల కోర్టు ఎదురుగా ఉన్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించమని ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి చెప్పిన స్పందించకపోవడంతో వార్డు కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సామినేని మనోహర్ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పేరం సైదేశ్వర రావు, పద్నాలుగవ వార్డ్ కౌన్సిలర్ నకిరేకంటి వెంకట్, ఒకటవ వార్డు ప్రజలు పాల్గొన్నారు.