ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో యద్దనపూడి రామకృష్ణ తెలిపారు. ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు అందరూ తప్పక హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే ఈ సమావేశంలో మండల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చించడం జరుగుతుందని అన్నారు.