ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అందించటమే లక్ష్యంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఈ నెల 30వ తేదీలోగా త్రాగునీటి కుళాయి కనెక్షన్స్ అందించడానికి నిర్ణయించినట్టు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. మంగళవారం ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ, ఈ పధకంలో భాగంగా పైపులు ఉచితంగా వేయబడునని, పధకంలో ఆస్థి, ధృవ పత్రములు లేనిచో నోటరీ చేయించిన పత్రాలపై కూడా కుళాయి మంజూరు చేయబడునని తెలిపారు.