అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

55చూసినవారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చందమామ బాబు జిల్లా కలెక్టర్ బాలాజీను కలిశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించి యోగ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీను కోరారు. కలెక్టర్ బాలాజీ సానుకూలంగా స్పందిస్తూ జిల్లా అధికారులతో, ప్రజలతో యోగ డేను ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్