మచిలీపట్నంలో జిల్లా పోలీస్ శాఖలోని ఆర్మడ్ రిజర్వ్, హోంగార్డ్స్ సిబ్బందికి, శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పెరేడ్ కు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆర్ఐ సతీష్ కుమార్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరించగా, పెరేడ్ కు హాజరైన ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ ప్లటూన్ల వారీగా ఇన్స్పెక్షన్ చేసి, సిబ్బంది టర్న్ అవుట్ ను పరిశీలించారు.