ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మచిలీపట్నం ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఏ. వి. శివకుమార్ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణం సాగిస్తున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. కోనేరు సెంటర్, రేవతి సెంటర్ వద్ద ట్రాఫిక్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.