విద్య బోధనలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం కూడా నేర్పించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు పాల్గొన్నారు.