ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఐసిడిఎస్ మైలవరం ప్రాజెక్ట్ పరిధిలోని జి.కొండూరు మండలం జి.కొండూరు సెక్టార్ సూపర్వైజర్ ఇందుపల్లి అన్నమ్మ పర్యవేక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు గృహ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.జి.కొండూరు-1,కోడ్ నెంబర్ 212,జి.కొండూరు-4,కోడ్ నెంబర్ 215 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు బి.వాణి,కె.హేన కవులూరు గ్రామంలోని కవులూరు-1,4 కోడ్ నంబర్లు 222,225 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు సలోమీ,రత్నకుమారి లు అలాగే సున్నంపాడు గ్రామంలోని కోడ్ నెంబర్ 230 అంగన్వాడీ కేంద్రం కార్యకర్త శిరీష ,చెరువు మాధవరం గ్రామంలోని కోడ్ నంబర్లు 201,202 మునగపాడు గ్రామంలోని కోడ్ నెంబర్ 229 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు స్వర్ణలత,దేవకారుణ కృష్ణవేణి లు ఆయా కేంద్రాల పరిధిలో ని ఏరియాలలో ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీలు,బాలింతలకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి వివరిస్తూ కుటుంబ సభ్యులలో చైతన్యం తీసుకువచ్చా రు.వీటితో పాటు ఆరోగ్యసూత్రాలను పాటించాలని వారికి సూచించారు.