మైలవరం నియోజకవర్గం పరిధిలో గల విజయవాడ రూరల్ గొల్లపూడిలోని బీసీ భవన్ లో బీసీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ను మంత్రి సవిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జునరావు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.