మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం, ముత్యాలంపాడు గ్రామములో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ధ్రువ పత్రాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఏం ఆర్ ఓ రోహిణి దేవి, గ్రామ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు , సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.