విజయవాడ: గుంటుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత

68చూసినవారు
మైలవరం నియోజకవర్గంలో 37, 744 మందికి డిసెంబరు మాసంలో రూ. 15, 98, 31, 000 ల పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును ఆయన శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చుతోందన్నారు.

సంబంధిత పోస్ట్