కునపరాజుపర్వ గ్రామం లో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 70వ వన మహోత్సవం కార్యక్రమం లో మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని, నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి పి శంకర్ రావు, హై స్కూల్ హెచ్ఎం జీ పద్మావతి, గ్రామ సెక్రటరీ షేక్ మీరావాలి, కునపరాజుపర్వ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ తోటకూర రవి బాబు, రామిళ్ళ బాబురావు, కునపరాజుపర్వ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.