ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం గ్రామాల్లో మాల మహానాడు నాయకత్వంలో కొందరు దళితులు ధర్నా చేశారు. వర్గీకరణ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామ సర్పంచ్ కంచర్ల వాణి ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాల మహానాడు కార్యకర్తలు ఈ ధర్నా నిర్వహించారు.