నూజివీడు నియోజకవర్గంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముసునూరు మండలం గోపవరంలో ఉ. 7 గం. లకు గంగమ్మ జాతర, రమణక్కపేటలో ఉ. 10 గం. లకు గ్రామ సభ, నూజివీడు మండలం మెట్టగూడెంలో మ. 12 గం. లకు గ్రామ సభలో మంత్రి పాల్గొంటారు. మ. 2 గం. లకు బోర్వంచ మసీదు ప్రారంభిస్తారు.