మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, జౌళీ శాఖ మంత్రి ఎస్. సవిత దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. మంత్రి సవిత ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు.