నూజివీడులో వరిగడ్డి దగ్ధం

83చూసినవారు
నూజివీడులో వరిగడ్డి దగ్ధం
నూజివీడు మండలం జంగంగూడెంలో శనివారం ట్రాక్టర్ పై ఉన్న గడ్డి దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని రచ్చబండ వద్ద గ్రామానికి చెందిన అక్కినేని శ్రీరామ్మూర్తికి చెందిన ట్రాక్టర్ పై వరిగడ్డిని కట్టుకొని ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కరెంటు తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి వరిగడ్డి దగ్ధమైంది. ట్రాక్టర్ కొంత భాగం కాలడంతో దాదాపు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్