ముసునూరు మండలం గోగులంపాడులో చెరుకు నరికే వలస కూలి వ్యక్తిపై ఆదివారం పాము కాటు వేసింది. కాకినాడ జిల్లా రోతరపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మోళ్లీ చలబాబు(56) గత కొద్ది రోజుల నుండి గోగులంపాడు గ్రామంలోని ఒక రైతు చెరుకును కొందరు కూలీలతో కలిసి నరుకుతున్నారు. ఈ క్రమంలో చల బాబుపై పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. ప్రస్తుతం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.