రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం పామర్రు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి మచిలీపట్నం ప్రధాన రహదారిపై బందర్ రోడ్డు జాలయ్య మిల్లు దగ్గర ఫ్లైఓవర్ మీద విజయవాడ నుంచి మచిలీపట్నం వెళుతున్న ఏపీ 16 ఎఫ్. డి 5699 ఆ నెంబర్ గల హోండాసిటి కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి.