పగలు, రాత్రులు తేడా లేకుండా వైన్ షాప్ నుండే నేరుగా బెల్ట్ షాప్ కి కారులో మద్యం తరలించారనే వార్త మంగళవారం పామర్రు నియోజకవర్గంలో దావనంలా వ్యాపించింది. నియోజకవర్గంలో మద్యం యాజమాన్యం కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ కు 20 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని మద్యపాన ప్రియులు ఆరోపిస్తున్నారు.