పామర్రు: గ్రామీణ క్రీడలను కాపాడుకుందాం

51చూసినవారు
పామర్రు: గ్రామీణ క్రీడలను కాపాడుకుందాం
గ్రామీణ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. తోట్లవల్లూరు మండలంలోని పెనమకూరులో భారత యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన సంక్రాంతి పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కోడి పందేలు, జూదానికి వ్యతిరేకంగా భారత యువజన సంఘం గత అనేక ఏళ్లుగా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్