పామర్రు: గుండెపోటుతో సర్పంచ్ మృతి

79చూసినవారు
పామర్రు: గుండెపోటుతో సర్పంచ్ మృతి
గుండె పోటుతో ఓ గ్రామ సర్పంచ్ మృతి చెందిన సంఘటన పామర్రు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామర్రు మండలం కనుమూరు గ్రామ సర్పంచ్ కొడాలి సుఖవేణి గురువారం రాత్రి గుండె పోటుకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ సర్పంచ్ కొడాలి సుఖవేణి మరణ వార్త తెలుసుకున్న మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన సర్పంచులు, టిడిపి నాయకులు శుక్రవారం కనుమూరు గ్రామానికి తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్