మొవ్వ మండలం కూచిపూడి అగ్రహారంలో ప్రతి ఏడు తొమ్మిది రోజులు కూడా జరిగే సావిత్రి గౌరీ నోములు గురువారం ప్రారంభించారు. ముక్కనుము నాడు ప్రారంభమయ్యే పూజాది కార్యక్రమాలను గత ఎనిమిది సంవత్సరాలుగా మహిళలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా పురోహితులు పాండురంగ శర్మ ఇంటి వద్ద ఊయల (పీఠాన్ని)లో సావిత్రి గౌరీదేవి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా అధికారి కార్యక్రమాలను ప్రారంభించారు.