పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల నీట మునిగిన పంట పొలాలను మరియు డ్రైన్లను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టమని తెలిపిందని, అందులో భాగంగా గ్రామాల్లో పర్యటించినట్టు తెలిపారు.