కలకత్తా నుంచి తమిళనాడు వెళ్తున్న లారీ శుక్రవారం తెల్లవారుజామున పెడన మసీద్ వద్ద హైవే డ్రైన్ ని ఢీ కొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారమందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.