పెడన: పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

76చూసినవారు
పెడన: పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రంలోని పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పెడన నియోజవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. సోమవారం పెడన మండలం జింజెరు గ్రామంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశుపోషకుల అభివృద్ధి కోసం తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. ఈ క్రమంలో పశువుల ఆరోగ్యానికి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్