రాష్ట్రంలో చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి నారా లోకేష్ కు పెడన నేతలు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కాక చేతినిండా పని లేక ఉపాధిని కోల్పోయారన్నారు.