పేద ప్రజల మనిషి వంగవీటి రంగా అని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. గురువారం బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.