పెడన పట్టణంలో జరగబోవు దసరా ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని 23 వార్డులలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పెడన మున్సిపల్ చైర్ పర్సన్ కటకం నాగ కుమారి ప్రసాద్ అన్నారు. గురువారం మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ప్రత్యేక పారిశుద్ధ చర్యలు చేపట్టినట్టు గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు, సభ్యులు పాల్గొన్నారు.