గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు అయిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని పనులు మొదలు పెట్టిందని సీఆర్డీఏ పరిధిలోని రూ. 2, 700 కోట్ల మేర పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.