మద్యం సేవించి వాహనములు నడిపిన వారికి 10,500 రూపాయలు జరిమానా, వాహనము సీజ్ చేయటం జరుగుతుందని ఉయ్యూరు ఎస్ఐ సురేష్ బాబు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యం సేవించి అల్లర్లకు పాల్పడిన, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరేత్తించడం, అతి వేగంతో రోడ్లపై తిరగటం, వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం జరుగుతుందన్నారు.