పెనమలూరు: పోలీస్ వాహనానికి తప్పిన పెను ప్రమాదం

63చూసినవారు
పెనమలూరు: పోలీస్ వాహనానికి తప్పిన పెను ప్రమాదం
పెనమలూరు మండలంలోని గోశాల జాతీయ రహదారిపై ఆదివారం పోలీసు రక్షక్ వాహనానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు పోలీస్ రక్షక్ వాహనానికి గోశాల వద్ద టైరు పగలడంతో వాహనం అదుపు తప్పి  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్