‘బటన్ నొక్కి సీఎం జగన్‌ను ఇంటికి పంపుదాం‘

19092చూసినవారు
‘బటన్ నొక్కి సీఎం జగన్‌ను ఇంటికి పంపుదాం‘
నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో శుక్రవారం నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్​తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం సైకో ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి భూములు దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన చట్టం రద్దు చేస్తూ దాని పై తాను రెండో సంతకం పెడతానన్నారు. అనంతరం నెల్లూరు రురల్ & సిటీ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నారాయణ ని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని అలాగే నెల్లూరు పార్లమెంట్ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలన్నారు. కాగా అంతకు ముందు టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన పిలుపునిచ్చారు. మే 13న బటన్ నొక్కి సీఎం జగన్‌ను ఇంటికి పంపుదామని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్