పశ్చిమ బెంగాల్లో ట్రైని వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై తిరువూరు పట్టణంలో శనివారం రాత్రి స్థానిక వైద్యులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వైద్య అధికారుల, సిబ్బంది పాల్గొన్నారు.