భవిష్యత్ తరాలను కాలుష్యం నుండి కాపాడాలి: రవికుమార్

312చూసినవారు
భవిష్యత్ తరాలను కాలుష్యం నుండి కాపాడాలి: రవికుమార్
స్థానిక గుళ్లపల్లి ఎన్ క్లేవ్ లో 70 వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు కలకొండ రవికుమార్ పార్టీ నేతలతో కలిసి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అదేవిధంగా వాటి సంరక్షణను చేపట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొందని, కాలుష్యం నుండి భావి తరాలను కాపాడలంటే చెట్లను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు యరమల రామ చంద్రారెడ్డి, కలకొండ రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సిబిఐ తనిఖీల కలకలం http://bit.ly/2LmXf9x క్లిక్ చేయండి

ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి...

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్