రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదర్సలలో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి అమలు చేయడం హర్షనియమని విస్సన్నపేట మండల వైసీపీ మాజి కో ఆప్షన్ సభ్యులు దస్తగిరి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేద ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ అండగా ఉంటున్నారని అందుకు ముస్లింలకు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనం అన్నారు. మదర్సలకి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దివంగతనేత రాజశేఖరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ ముస్లింలకు అండగా ఉన్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ముస్లింలు అందరూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుడే, సుభాని, మోసీన్, కరిమ, బాజి, జఫర్, పలువురు పాల్గొన్నారు.