విస్సన్నపేటలో మండల పరిషత్ సమావేశం వాయిదా

61చూసినవారు
విస్సన్నపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం కోరం లేక వాయిదా పడింది. ఎంపీపీ వనజాక్షి అధ్యక్షతన ఈ సమావేశాన్ని అధికారులు ప్రారంభించారు. కానీ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం సమావేశానికి సభ్యులు సరిపడా హాజరు కాకపోవటంతో అధికారులు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీటీసీలు సర్పంచులు ఈ సమావేశానికి హాజరు కాకపోవటం పై ఎంపీపీ వనజాక్షి అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్