ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు:ఎమ్మెల్యే రక్షణ నిధి

584చూసినవారు
ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు:ఎమ్మెల్యే రక్షణ నిధి
ప్రజలకు స్థానికంగా ఉన్న వాగుల్లో ఇసుకను అందుబాటులో తెచ్చేందుకు టోకెన్ పద్ధతిని బుధవారం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏ కొండూరు మండల అధికారులతో , అక్కడి పార్టీ నాయకులతో, ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు , అవినీతికి పాల్పడకుండా ప్రజల అవసరాలు గుర్తించి ఇసుకను పంపిణీ చేయాల్సిందిగా కోరారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు ఇసుక విషయంలో చేసిన దోపిడీ, దౌర్జన్యాలను, ప్రజలు గమనించి వారిని ఇంటికి సాగనంపారు అని ఈ సందర్బంగా అన్నారు. టీడీపీ వాళ్లు ఇసుక బకాసుర లాగా అడ్డదిడ్డంగా బ్లాక్ మార్కెట్లో ఒక ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు అమ్మిన ఘన చరిత్ర వాళ్లదని పేర్కొన్నారు. జగన్ పాలనలో అవినీతికి తావులేకుండా ప్రజలు సుఖ శాంతులతో ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్