మాస్కు ధరించని వారికి జరిమానా తప్పనిసరి విధిస్తామని విస్సన్నపేట ఎస్ఐ లక్ష్మణ్ గురువారం హెచ్చరికలు జారీ చేశారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగించాలని విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ మండల ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావొద్దు అన్నారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చిన ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకుంటే అపరాధ రుసుం విధిస్తామని ఎస్ఐ హెచ్చరించారు.