ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏ. కొండూరు(మ), రేపూడికి చెందిన స్థానిక టీడీపీ నేత, తిరువూరు మాజీ ఏఎంసి చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన అసత్య ఆరోపణలను గిరిజన యువకులు ఖండించారు. గురువారం రాత్రి నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే డౌన్ డౌన్ రమేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ గిరిజన యువకులు నినాదాలు చేశారు.