శ్రీ శ్రీ న్యూ కాంపస్ ప్రాంగణంలో వనం-మనం కార్యక్రమం

337చూసినవారు
శ్రీ శ్రీ న్యూ కాంపస్ ప్రాంగణంలో వనం-మనం కార్యక్రమం
విస్సన్నపేట శ్రీ శ్రీ న్యూ కాంపస్ ప్రాంగణంలో జరిగిన వనం మనం కార్యక్రమంలో భాగంగా ఎస్సై ఎం. లక్ష్మణ్ మొక్కలు నాటారు. అనంతరం ఇంటర్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి పదో తరగతి తర్వాత బాల్యానికి బాధ్యతలకు మధ్య ఇంటర్మీడియట్ కోర్సులోకి అడుగు పెడతారని అన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో మంచికి చెడుకి ఒక విద్యార్థి ఏ వైపు అడుగు వేస్తే ఆ వైపే అతని జీవితం పురోగమన దిశలో ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా విద్యాసంస్థల అధినేత లక్కినేని ప్రసాద్, డిస్టిక్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రామలింగా చార్యులు, శ్రీ శ్రీ విద్యాసంస్థల వ్యవస్థాపక కార్యవర్గం బి వి.రాజేశ్వరరెడ్డి, ఎన్ వెంకటేశ్వరరావు, సిహెచ్ రాజేంద్రప్రసాద్, ఎం పూర్ణ చంద్రరెడ్డి, విశ్రాంత తెలుగు అధ్యాపకులు ఎం.జయరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్