ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైలవరం ఇన్స్‌పెక్టర్ డి. చంద్రశేఖర్ నేతృత్వంలో మైలవరం ఎస్సై కె. సుధాకర్ మంగళవారం గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై మెరుపు దాడులు నిర్వహించారు. వెల్వడం గ్రామం శివారు ఫారెస్ట్ ఏరియాలో గుట్టు చప్పుడు లేకుండా నిర్వహిస్తున్న కోడి పందాల శిబిరంపై మెరుపు దాడి చేసి ముగ్గురు జూదరులను, 26 మోటార్ సైకిల్స్ 2కోడి పుంజులు, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.