తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు కోట్ల ఏడు లక్షల తో నిర్మించిన అదనపు భవనాన్ని విజయవాడ ఎంపీ కేసినేని నాని మంగళ వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి మరో ముఖ్య అతిథి తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొద్దిసేపు మాట్లాడారు. ప్రభుత్వ వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.