విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న అమ్మవారిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారు దర్శనం కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెన, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ప్రజలందరిపై ఉండాలని, ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఒక్కరుసుఖ సంతోషాలతో, సంపాదనతో ఎదగాలని, ఎదిగే విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు